రిషభ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. చాలా మంది ప్లేయర్లు ఆడటం ఆడకపోవటం ఉంటుంది కానీ పంత్ కేస్ ఈ సారి వేరే లెవల్. ఎందుకంటే మొన్న ఆక్షన్ లో అతన్ని ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27కోట్లు పోసి లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ను పంత్ ను పాడుకున్నారు. ఆ క్షణంలో ఆయన మొహంలో కనిపించిన ఆనందం తర్వాత ఎప్పుడూ మళ్లీ కనపడలేదు. పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన LSG మొదట్లో మంచి విజయాలే సాధించింది. మార్ క్రమ్, మిచ్ మార్ష్, పూరన్ మంచి ఫామ్ లో ఉండటంతో వాళ్లు ఆడిన మ్యాచ్ లను LSG ఈజీగా గెలుస్తోంది. ఎప్పుడైతే వాళ్లు ఫెయిల్ వుతారో అప్పుడు పంత్ అవసరం వస్తోంది. కానీ అలాంటి టైమ్ లోనూ పంత్ చేతులెత్తేస్తున్నాడు. నిన్నటిదే ఎగ్జాంపుల్. ముంబైతో జరిగిన లక్నో మ్యాచ్ లో ముంబై 215పరుగుల భారీ స్కోరు కొట్టింది. దీనికి ప్రతిగా లక్నో ఓపెనర్ మార్ క్రమ్, నికోలస్ పూరన్ త్వరగానే అవుట్ అయిపోయాడు. అలాంటి టైమ్ లో టైమ్ స్పెండ్ చేసి మిచ్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాల్సిన పంత్ 4 పరుగులకే ఔటై వెనుదిరిగి వచ్చాడు. ఈ సీజన్ లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన పంత్ కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు.పైగా అందులో ఒకటి హాఫ్ సెంచరీ 63పరుగులు. అది కూడా తీసేస్తే ఇక తొమ్మిది మ్యాచుల్లో పంత్ కొట్టింది కేవలం 50పరుగులు. ఇదే LSG జట్టును తీవ్రంగా కలవరపరుస్తోంది. బేసిక్స్ కి కట్టుబడి ఆడటం..టైమ్ తీసుకుని క్రీజులో సెటిల్ అవ్వటం లాంటి కూడా పంత్ చేయకపోవటమే ఈ ఫెయిల్యూర్స్ కి కారణంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న మ్యాచ్ లో LSG ఓటమి తర్వాత ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్ కి క్లాస్ పీకుతూ కనిపించారు. పంత్ మొహం పూర్తిగా మాడిపోయింది అంతలా తిట్టి ఉంటారు ఆయన. ఇంకేముంది 27కోట్లు ఒక్క ప్లేయర్ మీద ఆడకపోతే ఓనర్ కి ఆ మాత్రం బాధ ఉంటుంది కదా.